టాలీవుడ్ (Tollywood) యువ హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) చేస్తున్నలేటెస్ట్ మూవీ గని (Ghani). బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ (Ghani teaser)కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati)మీడియాతో చిట్ చాట్ చేశాడు.
‘సారొచ్చారు సినిమా తర్వాత డైరెక్టర్‌గా సొంత ప్రయత్నాలు చేసుకునేందుకు బ్రేక్ తీసుకున్నా. కానీ ఆ తర్వాత నేను తీసుకుంది రాంగ్ డెసిషన్ అనిపించిందన్నాడు కిరణ్ కొర్రపాటి. ఆ తర్వాత మిస్టర్ సినిమాకు కో డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. ఈ సినిమాకు పనిచేస్తున్నపుడు వరుణ్ తేజ్ నాకు చాలాక్లోజ్ అయ్యారు. తొలిప్రేమ సినిమాకు కూడా తనతో పని చేయమన్నాడు. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో వరుణ్ తేజ్‌కు భిన్నమైన కథలు చెప్పాను. అయితే వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలని అనుకున్నాడని ‘ చెప్పుకొచ్చాడు కిరణ్ కొర్రపాటి
గని సినిమాలో మొత్తం 4-5 పోటీలుంటాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా ఇందులోనే వస్తాయి. ప్రేక్షకులకు అసలు బాక్సింగ్ సినిమా చూసినట్టు అనిపించదు. సినిమా మొత్తం క్యూరియాసిటీగా సాగుతుందని చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) వరుణ్ తేజ్‌కు జోడీగా నటిస్తోంది.
సునీల్ శెట్టి (Sunil Shetty), జగపతిబాబు, నవీన్‌చంద్ర, నరేశ్ కీ రోల్స్ చేస్తున్నారు. రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్దు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.