Vishwak Sen | అభిమానులతో సినిమా చూడనున్న విశ్వక్ సేన్.. టైం ఎప్పుడంటే.. ?
అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓరి దేవుడా (Ori Devuda) చిత్రం మంచి టాక్తో ప్రదర్శించబడుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వహించాడు. కాగా కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఓరి దేవుడా (Ori Devuda). అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్తో ప్రదర్శించబడుతోంది. కాగా కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. హీరో విశ్వక్ సేన్ తన అభిమానులు, ఫాలోవర్లతో కలిసి సినిమా చూడబోతున్నాడు.
ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని దేవి 70ఎంఎం థియేటర్లో అభిమానులతో కలిసి ఇవాళ సెకండ్ షో చూసేందుకు వస్తున్నట్టు ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు విశ్వక్ సేన్. హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్ కూడా ఈ టీంలో జాయిన్ కాబోతున్నట్టు టాక్. ఓరి దేవుడా తమిళంలో తెరకెక్కిన ఓ మై కడవులేకు తెలుగు రీమేక్గా వచ్చింది.
తమిళ వెర్షన్ తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేశాడు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. సినిమాతోపాటు పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది.

Read Also : Puri Jagannadh | అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా.. పూరీ జగన్నాథ్
Read Also : Nani | సంతోష్ శోభన్లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Vaarsudu Movie | భారీ ధరకు ‘వారసుడు’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

