టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) శాంటాక్లాజ్ క్యాప్ (Santa Claus cap) ధరించి సందడి చేయడం కొత్తేమీ కాదు. ఈ సారి కూడా క్రిస్మస్ (Chistmas wishes)కు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నా ప్రయాణంలో, నా కమ్యూనిటీతో నేను సంపాదించిన కొంత డబ్బు. 1 మిలియన్ ఇవ్వండి. మీరు కూడా శాంటాగా మారి.. ఎవరికైనా 10,000/- బహుమతిగా ఇవ్వండి. అలాగే ఆ డబ్బు ఎందుకు అవసరమో చెప్పండి. 100 మంది పేర్లను జనవరి 1న ప్రకటిస్తాం..అంటూ #DeveraSanta21 హ్యాప్ట్యాగ్ను జోడిస్తూ స్పెషల్ వీడియో షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
100 మందికి విజయ్ దేవరకొండ సొంత పాకెట్ మనీ నుంచి రూ.10 లక్షలు బహుమతిగా ఇవ్వాలనుకోవడం నిజంగా గొప్ప విషయమంటూ ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విజయ్ దేవర కొండ సామాజిక సేవలో ముందుంటాడని తెలిసిందే. గతంలో సుమారు 600 మందికి పైగా చిన్నారులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. 2020లో చాలా మంది చిన్నారులకు అండగా నిలిచి గొప్ప మనసు చాటుకున్నాడు.
ప్రస్తుతం పూరీజగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. బాలీవుడ్ నటి అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది.