Khairatabad Resident | ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ హయాంలో ఖైరతాబాద్ పరిస్థితి ఎలా ఉందో స్థానిక వ్యక్తి ఒకరు చెప్పిన మాటలు చెప్పకనే చెబుతున్నాయి.
మళ్లీ బై ఎలక్షన్ వస్తుంది.. మళ్లీ మీకు అవకాశం వచ్చింది.. దీని గురించి ఏం చెప్తరు మీరు అని ఖైరతాబాద్ నివాసిని రిపోర్టర్ అడుగగా… వచ్చి నిలబడండి.. మేము ఓటేస్తం.. ఓటు వేసినోళ్లను పబ్లిక్‌ను చూడమంటం.. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోండి.. సమస్యలేంటో తెలుసుకోండి.. వచ్చి గెలిచి ఎన్నికల తర్వాత కనిపించకపోతే వేస్ట్ కదా.. బీఆర్ ఎస్ ఉన్నపుడు అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. ఒక రోజు కాకుంటే రెండు రోజుల్లోన్నైనా మున్సిపాలిటీ వాళ్లు వచ్చి క్లీన్ చేసి సమస్య షరిష్కరించేవాళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఎవరూ ఒక్కసారి కూడా వచ్చింది లేదన్నాడు.
మొన్న బోనాల పండగలకు స్ట్రీట్ లైట్లు లేకుంటే కరెంట్ వాళ్లను పిలిపించి మేం వేయించుకున్నం. ఏమన్నా కాంగ్రెస్ సర్కార్ ఫండ్స్ లేదంటది.. ఎప్పుడూ కేసీఆర్ మీద ఏడ్చుడే తప్పించి వాళ్లు ఏమైనా చేశారా…సీఎం రేవంత్ ఏమైనా చేశాడా.. అంటే ఒప్పుకుంటాం.. ఆయనేమైనా చేసిండో చెప్పాలని డిమాండ్ చేశాడు. కేవలం ఆడవాళ్లకు ఫ్రీ బస్ తప్ప ఏం చేయలేదు. మాకు బస్సులో పోవడానికి కూడా అవకాశం లేదని చెప్పుకొచ్చాడు.
అస్తమానం కేసీఆర్ గారిపై ఏడవడం తప్ప..
ఈ రేవంత్ రెడ్డి చేసిందేమి లేదు.స్ట్రీట్ లైట్లు కూడా పని చేయకపోతే..
మేమే పైసలు పెట్టుకొని చేయించుకున్నాం.కాంగ్రెస్ వచ్చినంక ఒక్క పని కూడా చేయలేదు.
– ఖైరతాబాద్ నివాసి https://t.co/T4BcmmXhpP
— BRS Party (@BRSparty) October 5, 2026