ఇండస్ట్రీ లో అప్పటివరకు ఉన్న హద్దులను చెరిపేసి ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి
(Arjun Reddy). విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్ ను మలుపు తిప్పి..అతన్ని ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా. ఈ చిత్రంతో జబల్పూర్ సుందరి షాలినీ పాండే ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్ షాలినిపాండే ఆఫర్ల మీద ఆఫర్లు తెచ్చిపెట్టింది. మహానటి లాంటి పెద్ద ప్రాజెక్టులో తన నటనతో అందరినీ ఆకట్టుకుందీ భామ.
షాలిని పాండే ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో జయేశ్ భాయ్ జోర్దార్ (Jayeshbhai Jordaar) సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అర్జున్ రెడ్డి విడుదలై నేటికి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా షాలిని పాండే పలు విషయాలు షేర్ చేసుకుంది. సినిమా సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)కే దక్కుతుందని చెప్పింది. నేను అర్జున్ రెడ్డికి రుణపడి ఉంటాను. నాకు నటిగా ఈ చిత్రం మ్యాప్ లాగా పనిచేసింది. నా స్థాయికి మించి ఉత్తమ నటన కనబరిచే ప్రయత్నం చేశాను. నా యాక్టింగ్ కు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించి, నా కష్టాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది.
అర్జున్ రెడ్డి అందించిన విజయం బహుముఖ కళాకారిణిగా గుర్తింపు పొందాలనే నా అభిరుచికి ఆజ్యం పోసింది. ఈ సినిమా ఓ నటిగా నా వ్యక్తిగత లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలా నమ్మకాన్ని అందించిందని చెప్పుకొచ్చింది. రణ్ వీర్ సింగ్ సినిమా గురించి ప్రస్తుతానికి ఏం మాట్లాడలేను. నా పాత్రకు సంబంధించిన అప్ డేట్ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందేనని చెప్పింది.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!