Vijay Deverakonda | మాట నిలబెట్టుకున్న ‘లైగర్’ స్టార్..షణ్ముఖ ప్రియకు ఛాన్స్..వీడియో
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. షణ్ముఖ ప్రియకు లైగర్ (Liger) సినిమాలో పాట పాడే అవకాశం కల్పించాడు.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ (Liger) సినిమాలో పాట పాడే అవకాశం కల్పించాడు. తన అభిమాన నటుడే ఏకంగా మంచి ఆఫర్ ఇవ్వడంతో ఆనందంలో ఎగిరి గంతేసింది ఆ గాయని. ఇంతకీ ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరిస్తూ..ఇండియన్ ఐడల్ సీజన్ 2లో మెరిసిన యువ గాయని షణ్ముఖ ప్రియ (Shanmukha Priya) .
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్‌లో షణ్ముఖ ప్రియ ఓ పాటతో అందరినీ అలరించబోతుంది. షణ్ముఖ ప్రియ తన తల్లితో కలిసి హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లింది. తనిష్క్ బాఘ్చి మ్యూజిక్ కంపోజిషన్ లో షణ్ముఖ ప్రియ పాట పాడింది. తుది మిక్సింగ్ అయిపోయిన తర్వాత పాటను వినాలని షణ్ముఖకు చెప్పాడు విజయ్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తల్లి షణ్ముకను సత్కరించింది.
ఆ తర్వాత చీరలు, ఇతర బహుమతులు అందజేసింది. రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

