Anni Manchi Sakunamule | హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు సంతోష్ శోభన్ (Santosh Soban). నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలనాటి అందాల తార గౌతమి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ టాలెంటెడ్ నటి మీనాక్షి పాత్రలో కనిపించనుండగా.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
గౌతమి తెలుగుదనం ఉట్టిపడేలా హోమ్లీ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. అన్నీ మంచి శకునములే టీజర్ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మూవీ లవర్స్ కు అందించిన స్వప్నా దత్, ప్రియాంకా దత్ మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేశ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, అర్జుణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ శోభన్ మరోవైపు ప్రేమ్ కుమార్, శ్రీదేవి శోభన్ బాబు చిత్రాల్లో నటిస్తున్నాడు.
గౌతమి ఫస్ట్ లుక్..
మా మీనాక్షి!
Witness #TheWorldOfAMS Teaser on March 4th 💚@gautamitads #AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair @nandureddy4u @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms @MitravindaFilms @SonyMusicSouth @KurapatiSunny @RIP_apart @LakshmiBhupal pic.twitter.com/sVLoLHEgiK
— Mitravinda Movies (@MitravindaFilms) March 1, 2023
Ponniyin Selvan 2 | పొన్నియన్ సెల్వన్ 2 వాయిదాపై మణిరత్నం టీం క్లారిటీ
Kamal Haasan | మా టీం రోజంతా కష్టపడుతోంది.. ఇండియన్ 2పై కమల్ హాసన్
Kavya Kalyanram | సిరిసిల్లకొస్తే మా అమ్మమ్మ ఊరికి వచ్చినట్టనిపిస్తది : కావ్యా కళ్యాణ్ రామ్
Naveen Polishetty | అనుష్కతో నవీన్ పొలిశెట్టి ఫన్ చిట్‌చాట్.. టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్