శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 12:17:41

గాలి ప్ర‌భావం.. దేవుళ్ళు దిగి వ‌చ్చారు!

గాలి ప్ర‌భావం.. దేవుళ్ళు దిగి వ‌చ్చారు!

హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి స‌మ‌ర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రం గాలి సంప‌త్.  యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీష్ తెర‌కెక్కిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. డిసెంబ‌ర్ 5 వ‌ర‌కు అర‌కులో షెడ్యూల్ జ‌రిపిన త‌ర్వాత హైద‌రాబాద్‌లో మిగ‌తా షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు.

తాజాగా చిత్రానికి సంబందించి ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. వ్యాన్‌లో దేవుని అవ‌తారాల‌లో ఉన్న వ్య‌క్త‌లు ఉండ‌గా, గాలి ప్ర‌భావం వ‌ల‌న దేవుళ్లు దిగి వచ్చారు అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఓ డిఫరెంట్ ఎమోషన్‌తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. అచ్చు రాజ‌మ‌ణి సంగీతం అందిస్తున్నారు.  


logo