Pradeep Sarkar | బాలీవుడ్ దర్శకుడు (Bollywood Director) ప్రదీప్ సర్కార్ (68) (Pradeep Sarkar) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ప్రదీప్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. పొటాసియం స్థాయులు క్రమంగా పడిపోవడంతో వెంటనే ప్రదీప్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రదీప్ సర్కార్ (Pradeep Sarkar) మృతి వార్తను బాలీవుడ్ నటి నీతూ చంద్ర (Nitu Chandra) ట్విట్టర్ (Twitter) ద్వారా తెలియజేశారు. ‘ప్రియమైన దర్శకుడు ప్రదీప్ సర్కార్ దాదా మృతి వార్త నన్ను ఎంతో బాధించింది. నా సినీ కెరీర్ ఆయన చిత్రంతోనే ప్రారంభమైంది’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgn) విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రదీప్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.
సినిమాల్లోకి రాకముందు ప్రదీప్ సర్కార్ (Pradeep Sarkar) పలు మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించేవారు. 2005లో వచ్చిన ‘పరిణీత’ (Parineeta) సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక మొదటి సినిమాతోనే బీటౌన్‌లో తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్నారు ప్రదీప్ సర్కార్. ఆ చిత్రంలో బాలీవుడ్ నటులు విద్యా బాలన్, సైఫ్ అలీఖాన్, సంజయ్ దత్ నటించారు. ఆ చిత్రం తర్వాత లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి అద్భుతమైన సినిమాలను ఆయన తెరకెక్కించారు. బాలీవుడ్లో ఎంతో మంది స్టార్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు దాదా.
Very sad to know about our dearest director @pradeepsrkar dada. I started my career with him. He had an aesthetic talent to make his films look larger than life. From #Parineeta#lagachunrimeindaag to a no. Of movies. Dada, you will be be missed. #RestInPeace 🙏😔 @SrBachchan pic.twitter.com/TDxUOP2quG
— Nitu Chandra Srivastava (@nituchandra) March 24, 2023
Ohh! That’s so shocking!
Rest in peace Dada!!🙏 https://t.co/wOCqOlVd5Z— manoj bajpayee (@BajpayeeManoj) March 24, 2023
The news of Pradeep Sarkar’s demise, ‘Dada’ to some of us is still hard to digest.
My deepest condolences 💐. My prayers are with the departed and his family. RIP Dada 🙏— Ajay Devgn (@ajaydevgn) March 24, 2023
Ohh! That’s so shocking!
Rest in peace Dada!!🙏 https://t.co/wOCqOlVd5Z— manoj bajpayee (@BajpayeeManoj) March 24, 2023
DADA!!! Why??? I’ll miss you dada. Will always remember you as that child hearted, full of life man who taught me so much. Your creation Lafangey Parindey will always remain close to my heart ❤️. My prayers with the family 🙏🏻🙏🏻🙏🏻. pic.twitter.com/qcka5Kn5cB
— Neil Nitin Mukesh (@NeilNMukesh) March 24, 2023
Sad to know that
well known brilliant filmmaker of our country #PradeepSarkar ji passes away .
A great loss to the film Industry .
Heartfelt condolences to his family and near ones .
ओम् शान्ति !
🙏 pic.twitter.com/2RIC2F0w6e— Ashoke Pandit (@ashokepandit) March 24, 2023
Also Read..
Vishwak Sen | దాస్ కా ధమ్కీ మూవీకి నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్..
Ajith father | స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం