
Vishwak Sen | “ఫలక్‌నుమా దాస్’ (Falaknuma Das) చిత్రం కంటే ఈ సినిమా కోసం పదింతలు కష్టపడ్డా.

నటనతో పాటు దర్శకత్వం ఇష్టంతో చేస్తాను. కానీ ప్రొడక్షన్ మాత్రం ఒత్తిడితో ఉంటుంది’ అన్నారు విశ్వక్‌సేన్ (Vishwak Sen).

ఆయన కథానాయకుడిగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విశ్వక్‌సేన్ (Vishwak Sen) మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ లభించాయి.

కామెడీ సినిమాలు తీయడం చాలా కష్టం. దర్శకుడిగా అది నా బలం కాదు. యాక్షన్ డార్క్ డ్రామా సినిమాలను నేను బాగా డైరెక్ట్ చేస్తా.

ఈ సినిమాలో కామెడీ కూడా బాగా తీశానని మెచ్చుకుంటున్నారు. ఫస్టాఫ్‌లో మంచి వినోదం పండిందని అంటున్నారు.

ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశా. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ కథకు ఎవరూ న్యాయం చేయలేరని భావించి ఇంత డబ్బు పెట్టి సొంతంగా డైరెక్షన్ చేశా. సెకండాఫ్‌లో ట్విస్ట్‌లు ఉత్కంఠగా ఉన్నాయంటున్నారు.

ఈ సినిమా రెండో భాగం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం నాలుగు చిత్రాల్ని ఒప్పుకున్నా.

అవి పూర్తయిన తర్వాతే ఫలక్‌నుమా దాస్-2 (Falaknuma Das-2) , దాస్ కా ధమ్కీ-2 (Das Ka Dhamki-2) చిత్రాల దర్శకత్వం గురించి ఆలోచిస్తా.

ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నా.

ఈ రెండింటి తర్వాత నా సొంత బ్యానర్‌లో సినిమా ఉంటుంది. ‘గామి’ విడుదలకు సిద్ధంగా ఉంది’ అన్నారు.