Rahul Gandhi | రెండేండ్ల జైలు శిక్షతో రాహుల్ తన ఎంపీ పదవిని కోల్పోనున్నారా..? రాజకీయ వర్గాలు ఏమంటున్నాయి..?
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి గుజరాత్ (Gujarat)లోని సూరత్ (Surat) కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ (Rahul) రాజకీయ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి గుజరాత్ (Gujarat)లోని సూరత్ (Surat) కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. మోదీ (Pm Modi) ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన ప్రశ్నించారు. దీనిపై బీజేపీ కోర్టుకు వెళ్లింది. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో గురువారం విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రెండేండ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన సూరత్ కోర్టు.. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది.
ఈ నేపథ్యంలో రాహుల్ (Rahul) రాజకీయ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాహుల్ ఇక జైలుకు వెళ్లడం ఖాయమా..? ఆయన తన ఎంపీ (MP) పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుందా..? లేకపోతే.. ఎంపీ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఏదైనా వెసులుబాటు ఉంటుందా..? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నేర నిరూపణ రుజువైతే ఎంపీలు తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. పార్లమెంట్ సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేండ్లు జైలు శిక్ష పడితే వారు ఆ పదవికి అనర్హులవుతారు. ఇందులో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, లంచం, అత్యాచారం, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, క్రూరత్వం వంటి నేరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూరత్ కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, ఈ తీర్పులో పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో.. లోక్‌సభ సెక్రెటేరియట్ అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చన్నది మరికొందరి వాదన. ఈలోగా ఆయన పై కోర్టులో అప్పీలు చేసుకుంటే, శిక్షను తగ్గించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఆయనకు ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉండకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read..
Ajay Banga | భారత్ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి నామినీ అజయ్ బంగాకు కరోనా పాజిటివ్
LeT Terrorist | జమ్ముకశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
Rishi Sunak: క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

