LeT Terrorist | జమ్ముకశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) సోపోర్‌లో లష్కరే తొయీబా (LeT) ఉగ్రవాదిని (Terrorist) భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ పోలీసులు సోపోర్‌లోని (Sopore) పెత్ సీర్ రైల్వే స్టేషన్ సమీపంలో సయుక్తంగా గాలింపు చేపట్టారు.
బారాముల్లా: జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) సోపోర్‌లో లష్కరే తొయీబా (LeT) ఉగ్రవాదిని (Terrorist) భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ పోలీసులు సోపోర్‌లోని (Sopore) పెత్ సీర్ రైల్వే స్టేషన్ సమీపంలో సయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసి ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అతడిని ఉమర్ బషీర్ భట్‌గా గుర్తించారు. అతడు లష్కరే తొయీబా ఉగ్రసంస్థలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతని నుంచి హ్యాండ్ గ్రనేడ్, పిస్తోల్, పిస్తోల్ మ్యాగజైన్, 15 పిస్తోల్ లైవ్ రౌండ్లు, మొబైల్ ఫోన్, ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

