Casting Couch | సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (Casting Couch) అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అవకాశాల కోసం వెళ్లినప్పుడు, చిత్రీకరణ సమయంలో కొందరు తారలు కాస్టింగ్ కౌచ్‌కు గురవుతున్నారు. తమకు ఎదురైన ఆ చేదు అనుభవాలను ఏదో ఒక సందర్భంలో బయటపెడుతున్నారు. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) షాకింగ్ కామెంట్స్ చేశారు.
అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో తాజాగా పంచుకున్నారు. ‘ఓ సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ మీరు ఏం చేయడానికైనా సిద్ధమేనా..? అంటూ ఓ డైరెక్టర్ నన్ను అడిగాడు. కష్టపడి పనిచేస్తానని.. నా పాత్ర కోసం ఏది అవసరమో అది చేస్తానని చెప్పా. కానీ, అతను మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. నేను కూడా అతడు ఎంతకు దిగజారతాడో చూద్దామని ఏమీ తెలియనట్లే ప్రవర్తించాను’ అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలిపింది. ఇక సౌత్ షిల్మ్ ఇండస్ట్రీలో (South Films) ప్రొడ్యూసర్లు కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటారని నటి పేర్కొంది.
దక్షిణాది సినిమాలో అవకాశం కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. హైదరాబాద్‌లో ఓ నిర్మాతను (South producer) కలిసిన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. మీకు తెలుసా.. ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. ఎలా చెప్పినా వారి ఉద్దేశమైతే అదే అని తెలిసిపోయేది’ అని ఫాతిమా చెప్పుకొచ్చారు. నటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
2016లో వచ్చిన దంగల్ మూవీలో రెజ్లర్ గీతా ఫొగాట్ పాత్రలో ఫాతిమా నటించారు. ప్రస్తుతం మెట్రో ఇన్ దనో మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఫాతిమాతో పాటు ఆదిత్యరాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠీ లాంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read..
Shruti Haasan Birth Day | పెళ్లి ఊసెత్తని శ్రుతి హాసన్..! కమల్-సారిక విడాకులే కారణమా..?
Kriti Sanon | ధనుష్‌తో కృతిసనన్ లవ్‌స్టోరీ.. బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా తేరే ఇష్క్ మే
Prabhas | కన్నప్పలో నందీశ్వరుడిగా ప్రభాస్.. ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందంటే?