Shruti Haasan Birth Day | శ్రుతి హాసన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తండ్రి నటించిన ‘హే రామ్’ నటించి.. ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ తొలినాళ్లలో ఫ్లాప్‌లో ఇబ్బందిపడ్డ శృతి.. తక్కువ సమయంలోనే దక్షిణాదిలో అగ్ర హీరోయిన్ వరకు ఎదిగింది. నటనతో పాటు సింగర్‌గాను రాణిస్తున్నది. నేడు శ్రుతి హాసన్ 39వ బర్త్ డే. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓసారి తెలుసుకుందాం..!
Shruti Haasan
శ్రుతి హాసన్ 1986 జనవరి 28న తమిళనాడులో జన్మించింది. కమల్ హాసన్ – సాగరిక దంపతుల కూతురు. శ్రుతికి అక్షర హాసన్ అనే సోదరి సైతం ఉన్నది. శ్రుతి పూర్తి పేరు శ్రుతి రాజ్యలక్ష్మి హాసన్. 1984లో ‘రాజ్ తిలక్’ సినిమా షూటింగ్ సమయంలో కమల్ తొలిసారిగా సారికను కలిశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడగా.. తర్వాత ప్రేమగా మారడంతో కొద్దిరోజులు డేటింగ్ చేశారు. 1988 పెల్లి చేసుకోగా.. పెళ్లికి రెండేళ్ల ముందుగానే సారికకు శ్రుతి జన్మించింది. 2004లో కమల్ హాసన్- సారిక విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.
Shruti Haasan
శ్రుతి హాసన్ 2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే రాం’ మూవీలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత సంగీతంపై దృష్టి సారించింది. 2008లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్’ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన హీరోయిన్గా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. శ్రుతికి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. 2011లో తెలుగులో కే రాఘవేంద్రరావు తనయుడు కే ప్రకాశ్ దర్శకత్వంలో సిద్ధార్థ్‌తో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్‌గా పరాజయం పాలైంది. కానీ, ఆ ఏడాది ఉత్తమ తెలుగు డెబ్యూటీ నటి విభాగంలో ఫిలింఫేర్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా విజయం సాధించలేకపోయాయి. 2012 పవన్ కల్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’ మూవీ శ్రుతి హాసన్ కెరియర్ను మలుపుతప్పింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది.
Shruti Haasan
నాలుగు పదుల వయసు దగ్గరకు వస్తున్నా శ్రుతి హాసన్ పెళ్లి ఊసెత్తడం లేదు. తనతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పలువురు హీరోయిన్లు పెళ్లయి.. కుటుంబంతో జీవిస్తున్నారు. అయితే, శ్రుతి హాసన్ మాత్రం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నది. గతంలో ఇద్దరితో రిలేషన్లో ఉన్నా.. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నది. పెళ్లి చేసుకోకపోవడానికి కమల్ హాసన్ – సారిక విడాకులే కారణంగా తెలుస్తున్నది. గతంలో విడాకులు, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే.. పిల్లలపై ఆ ప్రభావం పడుతుందని చెప్పింది. పెళ్లయిన 20 సంవత్సరాల తర్వాత విడిపోవాలన్న నిర్ణయం పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఆ బాధను అనుభవిస్తారని పేర్కొంది. తల్లిదండ్రుల విడాకుల తర్వాత మాత్రమే తన కాళ్లపై తాను నిలబడడం ఆధారపడటం అంటే ఏంటో తాను అర్థం చేసుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకరు మరొకరిపై ఆధారపడ్డప్పుడు విడాకుల నిర్ణయం మరింత కష్టంగా ఉంటుందని చెప్పింది. తల్లి గురించి ప్రస్తావిస్తూ.. తన తల్లికి ఓ కూతురిగా ఉండడంతోనే తాను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని గ్రహించినట్లు చెప్పింది. పెళ్లిపై స్పందిస్తూ తన దృక్పథం వ్యక్తిగత నమ్మకాలతో ముడిపడి ఉందని చెప్పింది.
Shruti Haasan
తల్లిదండ్రుల విడాకులు, గత అనుభవాల ప్రభావం పెళ్లి నిర్ణయంపై ఎలాంటి ప్రభావం తేదని చెప్పినా.. ఇప్పటికీ ఏడుఅడుగులు వేసేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. గతంలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వ్యాఖ్యానించిన శ్రుతి.. తాను మొత్తానికి పెళ్లి చేసుకోనని అనలేదని చెప్పింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఊహించని విధంగా మార్పులు జరుగుతుంటాయని తెలిపింది. తాను పెళ్లి చేసుకోనని చెప్పానని.. మొత్తానికే చేసుకోలేనని చెప్పలేదని.. తాను ఎక్కువగా రిలేషన్‌లోనే ఉండేందుకు ఇష్టపడుతానని పేర్కొంది. భవిష్యత్‌లో ఎవరైనా మనసుకు దగ్గరైతే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల గురించి వస్తే చివరిసారిగా తెలుగులో సలార్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం రజనీకాంత్ సరసన కూలీ మూవీతో పాటు ట్రైన్, తెలుగులో సలార్ పార్ట్-2లో నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
Shruti Haasan
Kriti Sanon | ధనుష్‌తో కృతిసనన్ లవ్‌స్టోరీ.. బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా తేరే ఇష్క్ మే
Prabhas | కన్నప్పలో నందీశ్వరుడిగా ప్రభాస్.. ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందంటే?