విజయ్ సేతుపతి అంటే ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎగబడుతుంటారు. విజయ్ ఒక సినిమాకు ఓకే చెప్పాడు అంటే అందులో కచ్చితంగా కొత్త కథ ఉంటుంది అని నమ్మకం అందరిలోనూ సృష్టించాడు సేతుపతి. అందుకే ఆయన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఏడాది కింది వరకు విజయ్ సేతుపతి వరుస విజయాలలో ఉన్నాడు. కానీ ఈ మధ్య ఆయన చేస్తున్న కొన్ని సినిమాలు అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. ఇంత ఇమేజ్, మార్కెట్ ఉండి ఎందుకు ఇలాంటి పిచ్చి సినిమాలు చేస్తున్నాడంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.
కథ వినడం లేదా.. లేదంటే రెమ్యునరేషన్ బాగా ఇస్తున్నారు కదా అని కథ వినకుండా సినిమా చేస్తున్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్య విజయ్ సేతుపతి నుంచి వచ్చిన కొన్ని సినిమాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తాజాగా ఆయన నటించిన ఆనబెల్ సేతుపతి సినిమా విడుదలైంది. థియేటర్స్లో కాకుండా డిస్నీ హాట్ స్టార్లో ఈ సినిమాను విడుదల చేశారు. సెప్టెంబరు 17 న విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. తాప్సీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. దీనికి వారం ముందు థియేటర్లలో లాభం అంటూ వచ్చాడు విజయ్ సేతుపతి. దివంగత దర్శకుడు ఎస్పీ జననాథన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ట్రీట్మెంట్ ఫెయిల్ కావడంతో సినిమా దారుణంగా బెడిసికొట్టింది.
ఇక అదే రోజు తుగ్లక్ దర్బార్ అనే మరో సినిమాతో వచ్చాడు విజయ్ సేతుపతి. ఇక్కడ చిత్రం ఏంటంటే కనీసం ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. అంత అద్భుతమైన మార్కెట్ ఇమేజ్ ఉన్న హీరో ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నటుడిగా మీ స్థాయి నిలబడే సినిమాలు చేయండి అంటూ ఆయనకు వినమ్రంగా అభ్యర్థన పెట్టుకుంటున్నారు. మరి విజయ్ సేతుపతి ఎంతవరకు ఫాలో అవుతారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..