ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే మహేష్ బాబు మనందరికీ సూపర్ స్టార్ కావచ్చు.. కానీ ఆయన పిల్లలకు మాత్రం ఆడించి పాడించి లాలించే తండ్రి. షూటింగ్ కు ప్యాకప్ చెప్పిన ఒకసారి ఇంటికి వెళితే ఆయన కూడా పిల్లాడు అయిపోతాడు. ఈ విషయం ఇప్పటికే కొన్ని వందల సార్లు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అభిమానులతో పంచుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత మహేష్ ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోల రూపంలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటి హీరోలలో టాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు.
ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన సమయాన్ని కచ్చితంగా ఇస్తాడు సూపర్ స్టార్. సమయం దొరికితే ఓకే.. దొరకకపోతే కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని మరీ కచ్చితంగా హాలిడే ట్రిప్ కు వెళుతుంటాడు. మహేష్ కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం మహేష్ బాబు పాత ఫ్యామిలీ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అందులో తన ఇద్దరు పిల్లలను ఎత్తుకొని ఉన్నాడు సూపర్ స్టార్. ఇదిగో మా ఫ్యామిలీ మ్యాన్ అంటూ మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.
కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. పరశురాం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీకి కమిట్ మెంట్ ఇచ్చాడు. ఏదేమైనా అటు సినిమాలు ఇటు ఫ్యామిలీ రెండింటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడంలో మహేష్ ఆరితేరిపోయాడు.
ఇవి కూడా చదవండి..
ఊర్వశి ట్రైనింగ్‌కు స్టన్ అవ్వాల్సిందే..వీడియో
విక్రమ్ కుమార్ నుంచి లేటెస్ట్ అప్డేట్..!
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!