Dulquer Salmaan | మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) …తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎంచుకునే సినిమాలు,పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. తెలుగులో మహానటి,సీతారామం వంటి చిత్రాలలో అద్బుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ మలయాళ స్టార్.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడైన మమ్ముట్టి తనయుడు ఈ దుల్కర్ సల్మాన్ అనే విషయం తెలిసిందే. గతంలో ఈ అగ్ర హీరో మమ్ముట్టి కూడా పలు తెలుగు సినిమాలలో నటించారు. కానీ కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేక పోయారు. కానీ ఈయన తనయుడు దుల్కర్ సల్మాన్ మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక క్రేజ్
ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన వరుసగా మరో రెండు తెలుగు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న `లక్కీ భాస్కర్`అనే మరో వైవిధ్యమైన సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్బంగా `లక్కీ భాస్కర్ `నుంచి టైటిల్ ట్రాక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు,మలయాళం,హిందీ, మరియు తమిళ భాషల్లో సెప్టెంబర్ 7 న విడుదల కానుంది. ఈయన పుట్టిన రోజు సందర్బంగానే మరో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
వైవిధ్యమైన చిత్రాలను రూపొందించే దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో `ఆకాశంలో ఒక తార`గా తెరకెక్కబోతున్న సినిమా లో దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతాఆర్ట్స్, స్వప్న సినిమాలతో పాటు లైట్ బాక్స్ మీడియా బ్యానర్స్ సమర్పణలో సందీప్ గుణ్ణం,రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మలయాళ హీరో ఇప్పుడు తెలుగులో క్రేజీ స్టార్ అయ్యినట్టేనా అని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Shah Rukh Khan | చికిత్స కోసం యూఎస్‌కు షారుఖ్‌ఖాన్..!
Raja Saab | సూపర్ స్టైలిష్ రాజాసాబ్గా ప్రభాస్ ఎంట్రీ.. మారుతి గ్లింప్స్ అదిరిందంతే..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!