Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్ట మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే కొత్త సీజన్‌తో లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది దుల్కర్ టీం. ఇప్పటికే టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్‌ను షూట్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. కాగా టాక్ షో షూటింగ్ సందర్భంగా దుల్కర్ సల్మాన్ దిగిన స్టిల్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. అతడొక సాధారణ వ్యక్తి. సాధారణ భారతీయ మధ్యతరగతి వ్యక్తి.. నమ్మదగిన వ్యక్తి.. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో ఇంత డబ్బా.. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఖాతాలోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది సస్పెన్స్‌లో పెడుతూ సాగే సీన్లు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Matka | సూపర్ స్టైలిష్‌గా వరుణ్ తేజ్.. మట్కా రిలీజ్ అనౌన్స్మెంట్ లుక్ వైరల్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్