Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ పోషిస్తోన్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో లాంఛ్ చేసిన టీజర్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది.
ముందుగా ఈ చిత్రాన్ని ఈ వినాయక చవితికి బిగ్ స్క్రీన్స్‌పై మరిచిపోలేని అనుభూతి ఫీలయ్యేందుకు రెడీగా ఉండండి.. అంటూ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తేదీని ముందుకు జరుపుతూ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు మరో తేదీ తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ పోరును దృష్టిలో పెట్టుకొని మేకర్స్ రిలీజ్ డేట్‌ను మరోసారి వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని అక్టోబర్‌లో విడుదల చేస్తారంటూ గాసిప్స్ వినిపిస్తుండగా.. మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. అతడొక సాధారణ వ్యక్తి. సాధారణ భారతీయ మధ్యతరగతి వ్యక్తి.. నమ్మదగిన వ్యక్తి.. . ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో ఇంత డబ్బా.. అంటూ టీజర్లో సాగే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఖాతాలోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది సస్పెన్స్‌లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Priyadarshi | ప్రియదర్శి నెక్ట్స్ సినిమా టైటిల్‌పై సమ్మోహనం మేకర్స్ క్లారిటీ
Stree 2 | 4 రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న శ్రద్దాకపూర్ స్త్రీ 2
World Of Vasudev | కిరణ్ అబ్బవరం క నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్