Kaantha | మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కాంత (Kaantha). సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో 1960స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ముందుగా తొలిమెరుపు ఉండబోతుందని తెలియజేసిన మేకర్స్ ట్రైలర్ అప్డేట్ చెబుతూ స్పెషల్ వీడియోను షేర్ చేశారు.
తాజా గ్లింప్స్ అసలిక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అనే డైలాగ్స్‌తో మొదలు కాగా.. ఈ సినిమా నేను తీస్తా.. మీరు అది ఒక మూలన కూర్చొని చూడండి.. అని దుల్కర్ సల్మాన్ అంటుంటే.. నిన్ను చంపబోతున్నాను మహదేవ అంటున్నాడు సముద్రఖని. కాంత ట్రైలర్‌ను నవంబర్ 6న విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. కాంత ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు , టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే కాంత మూవీ నుంచి విడుదల చేసిన అమ్మాడివే సాంగ్, రేజ్ ఆఫ్ కాంత (Rage Of Kaantha) ట్రాక్ సినిమాలపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కాంత సినిమాకు దుల్కర్ సల్మాన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
NC 24 | నాగచైతన్య – మీనాక్షి చౌదరి జంటగా ‘NC24’ ..ఆసక్తి రేపుతున్న దక్ష లుక్