Bad Girl On Jio Hotstar | ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో, నూతన దర్శకురాలు వర్ష భరత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన వివాదాస్పద చిత్రం ‘బ్యాడ్ గర్ల్’ (Bad Girl). ఇందులో బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చిత్రీకరించారనే ఆరోపణలు రావడంతో సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలను అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే పలు సన్నివేశాలను తొలగించిన అనంతరం సెప్టెంబర్ 05న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ‘బ్యాడ్ గర్ల్’ ఎట్టకేలకు ఓటీటీ (OTT)లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో (Jio Hotstar) ఈ చిత్రం ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సమాజం యొక్క కట్టుబాట్ల మధ్య తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని కోరుకునే ఒక మధ్యతరగతి యువతి కథ ఈ చిత్రం.