Kaantha | మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తోన్న సినిమా కాంత (Kaantha). పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు.
ఇటీవలే రేజ్ ఆఫ్ కాంత (Rage Of Kaantha) ట్రాక్‌ను విడుదల చేయగా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సాయంత్రం 4 గంటలకు తొలిమెరుపు ఉండబోతుందని నేడు కొత్త పోస్టర్ లాంచ్ చేశారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని రోల్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇంతకీ ఆ తొలి మెరుపు ఏంటనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది.
ఇప్పటికే కాంత మూవీ నుంచి అమ్మాడివే సాంగ్‌ను విడుదల చేశారని తెలిసిందే. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చే ఈ మెలోడీ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. భారతీయ సినిమాలో 1960ల నాటి గత యుగానికి నివాళిగా తెరకెక్కుతున్న కాంత సినిమాకు దుల్కర్ సల్మాన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
The fire starts with the first spark at 4:00pm TODAY!🔥
A @SpiritMediaIN and @DQsWayfarerFilm
production#Kaantha #DulquerSalmaan #RanaDaggubati #SpiritMedia#DQsWayfarerfilms #Bhagyashriborse#SelvamaniSelvaraj #Kaanthafilm#KaanthaFromNov14 @dulQuer @RanaDaggubati… pic.twitter.com/KL5VjMOINR— BA Raju’s Team (@baraju_SuperHit) November 4, 2025
NC 24 | నాగచైతన్య – మీనాక్షి చౌదరి జంటగా ‘NC24’ ..ఆసక్తి రేపుతున్న దక్ష లుక్