Aakasam Lo Oka Tara | గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్టందుకున్నాడు మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన ఈ స్టార్ యాక్టర్ మరో తెలుగు దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార (Aakasam Lo Oka Tara) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దుల్కర్ బర్త్ డే స్పెషల్‌గా గతంలోవిడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది.
దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ప్రయాణం మొదలైంది. ఆకాశంలో ఒక తార పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఇవాళ ఘనంగా జరిగింది. దుల్కర్ సల్మాన్, పవన్ సాదినేని, అశ్వినీదత్, అల్లు అరవింద్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. త్వరలోనే ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ మొదలు కానుంది.
ఈ చిత్రంలో కోలీవుడ్ భామ సాత్విక వీరవల్లి హీరోయిన్గా డెబ్యూ ఇస్తోంది. సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ మూవీ 2025లో విడుదల కానుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్నట్టు సమాచారం. లైట్ బాక్స్, స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
పూజా కార్యక్రమం..
Finally a Little Sandhadi…❤️
The Legendary Trio comes together to take our Star forward…💫#AakasamloOkaTara Journey Begins…❤️🔥#AOTMovie @dulQuer @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @pavansadineni @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/3OuZlFeqG0
— Geetha Arts (@GeethaArts) February 2, 2025
#AakasamloOkaTara pooja happened 🎬#DulquerSalmaan pic.twitter.com/WLN1I8Spjd
— Kerala Trends (@KeralaTrends2) February 2, 2025
Kiran Abbavaram | అప్పుడే కొత్త సినిమా.. కిరణ్ అబ్బవరం ఈ సారి ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే