సరిగ్గా నెల రోజుల ముందు దర్శక నిర్మాతల ఊహలు వేరు.. సంక్రాంతి వస్తుంది.. పెద్ద సినిమాలన్నీ ఒకేసారి విడుదల అవుతాయి.. పండగ చేసుకోవచ్చు అంటూ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. ఎవరూ ఊహించని విధంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభించి అందరి ప్లాన్స్ పాడు చేసింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని చావు దెబ్బ కొట్టింది. అందరూ ఊహించినట్లుగానే థర్డ్ వేవ్ విరుచుకుపడుతుంది. రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దాంతో అన్ని సినిమాలు మరోసారి ఆగిపోయాయి. విడుదల సంగతి దేవుడెరుగు ..షూటింగ్స్ కూడా ఆపేసి ఇంట్లో కూర్చున్నారు హీరోలు.
సంక్రాంతితోనే కొత్త సినిమాల విడుదల అగిపోయింది. ఇకపై మరో రెండు నెలల వరకు ఎలాంటి సినిమాలు విడుదలయ్యే అవకాశమే లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఊరు పేరు తెలియని చిన్న సినిమాలు విడుదల చేసుకోవాల్సిందే. వాటికి కలెక్షన్లు వచ్చేది లేదు.. పోయేది లేదు. ఏపీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. దాంతో రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు విడుదల చేయకూడదని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీల్లో ఇదే పరిస్థితి. దాంతో మరోసారి ఓటీటీ వైపు పెద్ద సినిమాలు అడుగులు వేసేలా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పండక్కి రావాల్సిన ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4న రావాల్సిన ఆచార్య ఏప్రిల్ ఒకటికి వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది అందరికీ ఉన్న అనుమానమే. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో సినిమాలు విడుదల తేదీలు ఇప్పుడు అయోమయంలో పడిపోయాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే రెండు నెలల వరకు కొత్త సినిమాలు విడుదల కావడం అసాధ్యమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్‌గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
రంగంలోకి దిగిన రజినీ, కస్తూరి రాజా.. ధనుష్, ఐశ్వర్య జంట మళ్లీ కలవబోతున్నారా!
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..