Vinod Kambli : భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ఆరోగ్యంపై తాజా అప్డేట్ వచ్చింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కాంబ్లీ.. ఇప్పుడు వృద్ధాశ్రమంలో కనిపించాడు. ఓల్డేజ్ హోంలో తాను చికిత్స తీసుకుంటున్నానని వీడియో ద్వారా అతడు అభిమానులకు తెలియజేశాడు. అయితే.. కాంబ్లీ మాట్లాడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడడం అందర్నీ కలవరపెడుతోంది. ఆ వీడియో చూసినవాళ్లంతా ”అయ్యో.. లెజెండరీ ఆటగాడికి ఎంత కష్టమొచ్చింది” అని ఆందోళన చెందుతున్నారు.
టీమిండియా ఒకప్పటి క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వైరలవుతున్నాడు. ఇప్పటివరకూ అనారోగ్యంతో బాధ పడుతూ మీడియాలో కనిపించిన అతడు ఈసారి వృద్ధాశ్రమంలో చేరాడు. కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న కాంబ్లీ ఈసారి సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఓల్డేజ్ హోంలో చికిత్స తీసుకుంటున్నట్టు వీడియో పెట్టిన అతడు.. అందులో తడబడడం చూసిన అభిమానులు ‘అయ్యో ఏమైంది’ అని గాబరా పడుతున్నారు.
विनोद कांबळीचा निदान वृद्धाश्रम आणि केअर सेंटरमधला व्हिडीओ व्हायरल, चाहते म्हणाले; ‘काळजी घे..’ https://t.co/fneftzTFSI via @loksattalive
— Rajan Dhawade (@RDhawade93614) September 26, 2026
‘నేను ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉన్నా. ఇక్కడ చికిత్స తీసుకుంటున్నా. ఇక్కడ వసతులు బాగున్నాయి. ఇక్కడ ఉంటున్నా సరే నేను ఇంటికి దూరంగా ఉన్నట్టు అనిపించడం లేదు. ఇక్కడున్న వాళ్ల నుంచి ఎంతో ప్రేమ, గౌరవం నాకు లభిస్తోంది’ అని కాంబ్లీ వీడియో పెట్టాడు.
Former cricketer Vinod Kambli is currently at old age home in Thane.
He says he is happy at the old age home. pic.twitter.com/xRvY59yb8W
— News Arena India (@NewsArenaIndia) September 25, 2026
భారత క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో ఒకడైన వినోద్ కాంబ్లీ 2013లో గుండెలో బ్లాకేజ్ కారణంగా ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ఆ తర్వాత అంతా బాగానే ఉన్నా మళ్లీ అతడు అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని రోజుల క్రితం మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ వెటరన్ స్ట్రోక్ ముప్పును ఎదుర్కొంటున్నాడు. క్లాట్ తీవ్రత కారణంగా అతడు కొద్దికొద్దిగా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాడు. తాజా వీడియోలో మాటల్లో తడబాటు అతడి ఆరోగ్యం మరింత దెబ్బతినడాన్ని సూచిస్తుంది. చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ఆడిన కాంబ్లీ.. పెద్దయ్యాక భారత్ తరఫున అదరగొట్టాడు. మొత్తంగా 17 టెస్టుల్లో 1,084 పరుగులు.. 104 వన్డేల్లో 2,477 రన్స్ సాధించాడు.