– ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.కె ఫహీమ్ దాదా
రుద్రంపూర్, సెప్టెంబర్ 26 : సింగరేణి ప్రాంతమైన రామవరం ప్రజల సొంత ఇంటి చిరకాల కోరిక జీవో 76 ప్రకారం సింగరేణి ప్రాంతంలో స్థలాలకు పట్టాలు ఇచ్చి తీర్చాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె ఫహీమ్ దాదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రామవరంలో ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎస్.కె ఫహీమ్ మాట్లాడుతూ.. దశబ్దాలుగా రామవరం ప్రజలు సొంతింటి కల సమస్య పరిష్కరించాలని, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సింగరేణి ప్రాంతాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, భద్రాద్రికొత్తగూడెం స్థలాలకి జీవో 76 ప్రకారం పట్టాలు ఇస్తామని తెలపడం జరిగిందని, అందులో రామవరాన్ని పొందుపరిచి దశబ్దాల ప్రజల సమస్య పరిష్కరించాలని అయన కోరారు,
2004 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లు కట్టుకునే అవకాశం కల్పించారని, అదే తరహాలో మరొకసారి రామవరం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు లు కట్టుకునే అవకాశం ఇవ్వాలని, అదేవిదంగా ఇల్లులకు పట్టాలు ఇవ్వాలని,సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం జీవో 76 ద్వారా కలిపించాలని అయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.ఖయ్యుమ్, ఉపాధ్యక్షులు భూపేష్, జావీద్, రసూల్, కమల్, కొయ్యడ రవి, బాబా, రామకృష్ణ, విజయ్ కాంత్, దాసరి శివ, శ్రీకాంత్, బన్ను, చిన్ను పాల్గొన్నారు.