బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ (Ajay devgn), శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం దృశ్యం 2 (Drishyam 2). మలయాళ హిట్ ప్రాంచైజీ ప్రాజెక్ట్ దృశ్యం ప్రాంచైజీలో హిందీలో ఫస్ట్ పార్టుకు కొనసాగింపుగా విడుదలైన దృశ్యం 2 బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీ నవంబర్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో ప్రదర్శించబడుతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా దృశ్యం 2 కలెక్షన్ల అప్డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రూ.160కోట్ల మార్కు చేరుకుంది. ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ దృశ్యం 2 కలెక్షన్లపై ట్వీట్ చేశారు. ఈ మేనియా ఇలాగే కొనసాగితే 200 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు ట్రేడ్ పండితులు.
అభిషేక్ పాఠక్దర్శకత్వం వహించిన దృశ్యం 2లో అక్షయ్ ఖన్నా, టబు, రజత్ కపూర్, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, పనోరమ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందించాడు.
దృశ్యం ప్రాంఛైజీ సినిమాలు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో చెప్పేందుకు తాజా కలెక్షన్లే ఉదాహరణ.
దృశ్యం 2 తాజా కలెక్షన్లు..
#Drishyam2 continues to set the cash registers ringing… Note the solid hold on weekdays, this movie is simply unstoppable… [Week 2] Fri 7.87 cr, Sat 14.05 cr, Sun 17.32 cr, Mon 5.44 cr, Tue 5.15 cr, Wed 4.68 cr. Total: ₹ 159.17 cr. #India biz. pic.twitter.com/pXe6pUou3T
— taran adarsh (@taran_adarsh) December 1, 2022
Read also :Hunt | సుధీర్‌బాబు టీం నుంచి హంట్ సినిమా కొత్త అప్డేట్
Read also :Poonam Kaur | అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్..?
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో