Aishwarya Lekhsmi | కామెడీ సీన్లు చేయడం నాకు చాలా కష్టం.. మట్టికుస్తీ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చిట్‌చాట్
చెల్ల అయ్యవు డైరెక్ట్ చేస్తున్న మట్టి కుస్తీ (Matti Kusthi) మట్టి కుస్తీ డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి సినిమా విశేషాలు మీడియాతో పంచుకుంది.
కోలీవుడ్ హీరో విష్ణువిశాల్ (Vishnu Vishal), ఐశ్వర్య లక్ష్మి కాంబోలో వస్తున్న చిత్రం మట్టి కుస్తీ (Matti Kusthi). చెల్ల అయ్యవు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హోం బ్యానర్లు ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ పై విష్ణువిశాల్-రవితేజ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మట్టి కుస్తీ డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య లక్ష్మి సినిమా విశేషాలు మీడియాతో పంచుకుంది.
సినిమా ఎలా ఉండబోతుంది?
మట్టి కుస్తి ఫ్యామిలీ డ్రామా.. భార్యాభర్తల మధ్య గొడవ.. రెజ్లింగ్, ఇగో, వినోదం.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.. కాబట్టి సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. ఇటీవల కాలంలో ఈ స్థాయి కుటుంబ భావోద్వేగాలు, వినోదం ఉన్న సినిమా మరేదీ రాలేదు. మట్టి కుస్తిలో స్త్రీ, పురుషులు సమానమని వినోదాత్మకంగా చూపించాం.
తెలుగు ప్రేక్షకులపై మీ అభిప్రాయం..?
తెలుగు ప్రేక్షకులు సినిమాలను బాగా ఇష్టపడతారు. అందువల్లే దేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమగా తెలుగు సినిమా ఎదిగింది. టాలీవుడ్ నుండి వస్తున్న ప్రతి సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు పరిశ్రమను ఫాలో అవడం మొదలుపెట్టాయి.
మీరు తెలుగు సినిమాలు చూస్తారా? మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు ?
తెలుగు సినిమాలు చూస్తా. అందరినీ ఇష్టపడతాను. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి ప్రతీ ఆర్టిస్టు తమ వంతు ప్రయత్నం చేస్తారు. ప్రేక్షకులు ఆదరించే సినిమాలు చేస్తారు. సాయి పల్లవి, సత్యదేవ్‌తో మంచి పరిచయం ఏర్పడింది.
నిర్మాత రవితేజను కలిశారా?
రవితేజ గారు షూటింగ్‌కి రాలేదు. కానీ హీరో విశాల్‌ను నమ్మి పూర్తి సహకారం అందించాడు. రవితేజ సర్ విశాల్‌ని ఫైనల్ ప్రొడక్ట్ చూపించమని అడిగాడు. ఔట్పుట్ చూసి రవితేజ సర్ సంతోషంగా ఉన్నారు.. ఆయనను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిశాను.
మట్టి కుస్తిలో ఛాలెంజింగ్‌గా అనిపించిన అంశాలు ?
సినిమాలో నా పాత్రకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ట్రైలర్లో నా విన్యాసాలు చూసి ఉంటారు. నాకు భావోద్వేగపూరితమైన సీన్లు చేయడం ఇష్టం..కానీ కామెడీ సీన్లు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందుకే ఈ సినిమాలో మొదటి సారి కామెడీ ప్రయత్నించా. ఈ సినిమా నాకు చాలా సవాలు లాంటిది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు..కానీ సినిమా అయితే వాళ్లకు నచ్చుతుందని ఆశిస్తున్నా.
మీరు ఎలాంటి సినిమాల్లో నటించాలనుకుంటున్నారు?
తమిళ, తెలుగు, మలయాళ ప్రేక్షకుల నుంచి నాకు మద్దతు లభించింది. అందువల్ల సినిమాల ఎంపికలో నాకు ఎమర్జెన్సీలాంటిదేమీ లేదు.. మంచి కథలు, పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలన్నది నా ఉద్దేశం.
మట్టి కుస్తీ గ్లింప్స్ వీడియో..
మట్టి కుస్తీ ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

