Sharwanand | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న చిత్రం బైకర్ (Biker). Sharwa 36 ప్రాజెక్టుగా వహిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించబోతున్నాడని తెలిసిందే. ఇదివరకెన్నడూ లేని విధంగా స్లిమ్‌గా మారిపోయాడు శర్వానంద్.ఈ సినిమా కోసం శర్వానంద్ 1 4 నెలల డైట్, వ్యాయామం, జిమ్, యోగా లాంటి వర్కవుట్ సెషన్స్‌లో పాల్గొంటూ 12 కిలోలు తగ్గాడు.
డిసెంబర్ 6న ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బైకర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు శర్వానంద్. ఈ సందర్భంగా ఫెయిల్యూర్స్‌ను అధిగమించండి.. అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చాడు. జీవితం అంటే మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు.. జీవితం అంటే అద్భుతమైన క్షణాలు, జ్ఞాపకాలు, సంతోషం, ప్రేమ. జీవితానికి పర్ఫెక్ట్ జనాలు కాదు కావాల్సింది.. మంచి వ్యక్తిగా ఉంటే విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మీ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. జీవితంలో ఏది శాశ్వతం కాదు.. అనవసరంగా ఒత్తిడిగా ఫీలవ్వొద్దని సూచించాడు శర్వానంద్.
నేను చాలా పరాజయాలను చూశా. మోసపోయాను.. నన్ను ఎక్కువగా ఉపయోగించుకున్నారనిపించినా.. వెనక్కి తగ్గలేదు. మళ్లీ పైకి లేచాను. అడ్డంకులను అధిగమించి పైకి లేస్తేనే నిజజీవితంలో హీరోగా నిలబడతావు. ఓర్పు, మంచితనం, నచ్చినట్టుగా జీవించటం, నిరంతరం కష్టపడి పనిచేయడం మరువొద్దు. ఎప్పుడూ వెనక్కి తగ్గొద్దు.. మీ బాధ్యతల నుండి పారిపోవద్దు అని సూచించాడు శర్వానంద్. మీ కథలో మీరే రైటర్‌గా ఉండాలి. మీ కథకు మీరే రైటర్‌గా ఉండి చరిత్రను సృష్టించాలి.. జీవితంలో నేను నేర్చుకున్నది ఇదే.. మీ అందరికీ కూడా ఇదే చెబుతున్నానన్నాడు. విద్యార్థులను ఆలోచింపజేసేలా సాగిన శర్వానంద్ స్పూర్తిదాయకమైన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Charming Star Sharwa inspired the students with a heartfelt speech on life and love ❤️
His words were full of honesty, hope, and wisdom — leaving everyone truly motivated.#Sharwa #Sharwanand #Biker pic.twitter.com/nCP2uikT7k— Ramesh Bala (@rameshlaus) November 15, 2025
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Bala Krishna | అఖండ 2 టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య సందడి .. హిందీ స్పీచ్ , తమన్‌తో సరదా
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!