సౌత్ ఇండియా (South India)లో కాదు మొత్తం ఇండియాలోనే ఖరీదైన దర్శకుడు ఎవరు అంటే.. మరో అనుమానం లేకుండా ఎవరైనా చెప్పే ఒకే ఒక్క పేరు శంకర్ (Shankar). ఆయన సినిమాలకు మంచి నీళ్ల కంటే దారుణంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు..సారీ నిర్మాతలతో పెట్టిస్తుంటాడు. తొలి సినిమా జెంటిల్ మెన్ (Gentlemen) నుంచి నిన్న మొన్నటి 2.0 వరకు ఒక్కో సినిమాకు శంకర్ పెట్టించిన బడ్జెట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. అయితే పదేళ్ల కిందటి వరకు శంకర్ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అనే నమ్మకం నిర్మాతలలో కనిపించేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లుతుంది.
కొన్నేళ్లుగా తన మార్కు సినిమాలు చేయడంలో విఫలమవుతున్నారు దర్శకుడు శంకర్. 2010లో విడుదలైన రోబో తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం పలకరించలేదు. త్రీ ఇడియట్స్ రీమేక్ నమ్బన్ తమిళంలో విజయం సాధించింది.. కానీ తెలుగులో డిజాస్టర్. ఆ తర్వాత వచ్చిన విక్రమ్ ఐ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. రజినీకాంత్ 2.0 సైతం డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాని మధ్యలోనే ఆపేశాడు శంకర్. ఇలాంటి సమయంలో ఈయన చెప్పిన కథ నచ్చి రామ్ చరణ్ (Ramcharan ) అవకాశం ఇచ్చాడు.
దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉండవని.. కేవలం కథ ప్రధానంగా సాగే సినిమా అంటూ ముందు నుంచే ప్రచారం జరుగుతుంది. బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగా ఉంటుందని వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ అక్టోబర్ లో మొదలు కానుందని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి సరికొత్త ప్రచారం మొదలైంది. రామ్ చరణ్ సినిమా కోసం 300 కోట్లకు పైగా బడ్జెట్ లెక్కలు చెప్పారని తెలుస్తోంది. మరోసారి తన మార్కు చూపిస్తూ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 8న బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ఓపెనింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతోనే హిందీలో అపరిచితుడు రీమేక్ చేస్తున్నాడు శంకర్. అందుకే రణ్వీర్ సింగ్ ఓపెనింగ్ కి వస్తున్నాడు. ఏదేమైనా కూడా రామ్ చరణ్ సినిమా కోసం 300 కోట్ల బడ్జెట్ పెట్టిస్తే మాత్రం అది నిజంగా సంచలనమే. త్రిబుల్ ఆర్ తర్వాత హిందీలో కూడా రామ్ చరణ్ మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి ఎంత పెట్టినా తిరిగి వస్తుంది అని నమ్మకం నిర్మాతలోనూ కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు. 2022 సమ్మర్ విడుదలకు సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!