DJ Tillu 2 Heroine | ఇంట్రెస్టింగ్ అప్డేట్..’డీజే టిల్లు 2’లో ‘కార్తికేయ 2’ భామ..!
డీజేటిల్లు 2 (DJ Tillu 2) షూటింగ్ మొదలుపెట్టేశాడు సిద్ధు జొన్నలగడ్డ. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసినట్టు తాజాగా ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.
డీజే టిల్లుతో బాక్సాపీస్‌ను షేక్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) డీజేటిల్లు 2 (DJ Tillu 2) షూటింగ్ మొదలుపెట్టేశాడు. ముందుగా వార్తల్లో వచ్చినట్టే ఈ చిత్రానికి నరుడా డోనరుడా, అద్బుతమ్ ఫేం మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసినట్టు తాజాగా ఫిలింనగర్లో వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే కదా మీ డౌటు. కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు అందుకున్న అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా చేసేందుకు అనుపమ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందట. కామెడీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సీక్వెల్లో అనుపమ, సిద్దు మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిపోయే రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయట.
అనుపమ ఎంపికపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే సీక్వెల్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. డీజే టిల్లు 2ను పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందించడం విశేషం.
కార్తికేయ 2 సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న అనుపమ ప్రస్తుతం నిఖిల్‌తో 18 పేజెస్ సినిమా చేస్తోంది. దీంతోపాటు బట్టర్ ఫ్లై సినిమాలో కూడా నటిస్తోంది.

Read Also : Bellamkonda Ganesh | ఎన్టీఆర్ 10 డాలర్లు వసూలు చేశాడట..కొత్త హీరో మాటల్లోనే..!
Read Also : Pawan Kalyan | పవన్ కల్యాణ్ బ్యాక్ టు వర్క్..క్రేజీ అప్డేట్లో నిజమెంత..!
Read Also : Kajal Agarwal Dance | హిట్ ట్రాక్‌కు కాజల్ స్టైలిష్ డ్యాన్స్..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Ram Heroine | రామ్ సినిమాకు అఖిల్ హీరోయిన్..ప్రకటనే తరువాయి..?
Read Also : Puri Jagannadh | గోవాలో పూరీ..ఇంతకీ ఏ హీరో కోసం కథ రాస్తున్నాడో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

