Aarti Ravi | కోలీవుడ్ స్టార్ యాక్టర్ జయం రవి (Jayam Ravi) ఇటీవలే విడాకులు ప్రకటించాడని తెలిసిందే. తన సతీమణి ఆర్తితో 15 ఏండ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల ప్రకటన చేశాడు జయం రవి. వ్యక్తిగల కారణాలు, కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కఠిన నిర్ణయం తీసుకున్నాం. ప్రతీ ఒక్కరూ మా ప్రైవసీని గౌరవిస్తారని విజ్ఞప్తి చేస్తున్నానని జయం రవి నెట్టింట అందరికీ విజ్ఞప్తి కూడా చేశాడు.
అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. విడాకుల అంశం గురించి ఆర్తి (Aarti Ravi) చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. జయం రవి విడాకుల ప్రకటన తన ప్రమేయం లేకుండానే చేశాడని చెప్పింది ఆర్తి. మేము కొంత కాలంగా ఒకరికొకరు మా కుటుంబం పట్ల ఉన్న నిబద్ధతను గౌరవించే విధంగా.. నా భర్తతో నేను నేరుగా మాట్లాడాలని అనేక సార్లు అనుకున్నా. కాలానుగుణంగా మన పరిస్థితి పూర్తిగా అర్థమవుతుందని నమ్ముతున్నా.
నాకు నా పిల్లల యోగక్షేమాలు మొదటి ప్రాధాన్యత. విడాకుల నిర్ణయం అనేది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్నదని తన స్టేట్మెంట్లో పేర్కొన్నది ఆర్తి. ఇప్పుడీ కామెంట్స్‌పై జయం రవి ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. ఆర్తి ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్ అయిన సుజాత విజయ కుమార్ కూతురు. జయం రవి-ఆర్తికి ఇద్దరు కుమారులు. జయం రవి చివరగా పొన్నియన్ సెల్వన్ 2తో సక్సెస్ అందుకున్నాడు. జయం రవి ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి.
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్