కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya) ప్రస్తుతం సూర్య 42 (Suriya 42) ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం గోవా షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతున్నట్టు ఇప్పటికే అప్ డేట్ వచ్చింది. కాగా తాజాగా కొత్త అప్డేట్ ఇచ్చారు టీం మెంబర్స్.
3 వారాల షెడ్యూల్ చిత్రీకరణ పూర్తవగా..నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. హీరోయిన్ దిశాపటానీ, డైరెక్టర్ శివ టీంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ అప్డేట్ అందించారు. గోవా షెడ్యూల్ లో దిశాపటానీతోపాటు ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు టాక్.
ఇప్పటికే విడుదల చేసిన సినిమా మోషన్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అయింది. సూర్య 42 చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. 3డీ ఫార్మాట్లో కూడా విడుదల చేయనుండగా..దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సూర్య 42 ప్రాజెక్టును స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సూర్య సినిమాలకు మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ ను అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరోసారి మ్యూజిక్ అందిస్తున్నాడు.
#Suriya42 It’s Schedule Wrap In Goa. @Suriya_offl @directorsiva @kegvraja pic.twitter.com/lLFUgiv1cR
— BA Raju's Team (@baraju_SuperHit) October 11, 2022
Read Also : Big B Project K Look | పవర్హౌస్లా బిగ్ బీ..ప్రాజెక్టు కే లుక్తో బర్త్ డే విషెస్
Read Also : Gundellona Song | ఓరి దేవుడా సాంగ్ అప్డేట్.. గుండెల్లోన లిరికల్ వీడియో
Read Also : Shikhar Dhawan | సినిమాల్లోకి శిఖర్ ధవన్ ఎంట్రీ.. వివరాలు చెప్పిన స్టార్ క్రికెటర్
Read Also : Ammu Trailer | ఐశ్వర్యలక్ష్మి కొత్త సినిమా.. గృహహింస నేపథ్యంలో అమ్ము ట్రైలర్
Read Also : Raghu Babu Look | రంగంపేట ప్రెసిడెంట్గా రఘుబాబు..జిన్నా నుంచి లేటెస్ట్ లుక్