టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా (Ori Devuda). అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి అంటూ సాగే పాట లిరికల్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు.
గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి అంటూ హీరోయిన్ గురించి హీరో పాడుకుంటున్న ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా..మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ పాడాడు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేశాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన ‘అవుననవా..అవుననవా..’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తమిళంలో తెరకెక్కిన ఓ మై కడవులేకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది.
తమిళ వెర్షన్ తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ మిథిలా పాల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఓరి దేవుడా చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Read Also : Shikhar Dhawan | సినిమాల్లోకి శిఖర్ ధవన్ ఎంట్రీ.. వివరాలు చెప్పిన స్టార్ క్రికెటర్
Read Also : Ammu Trailer | ఐశ్వర్యలక్ష్మి కొత్త సినిమా.. గృహహింస నేపథ్యంలో అమ్ము ట్రైలర్
Read Also : Raghu Babu Look | రంగంపేట ప్రెసిడెంట్‌గా రఘుబాబు..జిన్నా నుంచి లేటెస్ట్ లుక్