Telugu Film Federation | జానీ మాస్టర్ సతీమణికి షాక్.. సుమలత కమిటీని రద్దు చేసిన ఫిల్మ్ ఫెడరేషన్!
Telugu Film Federation | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత నాయకత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత వివాదాలు తారాస్థాయికి చేరడంతో, ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Tollywood Dancers Association | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత నాయకత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత వివాదాలు తారాస్థాయికి చేరడంతో, ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
ఫిల్మ్ ఫెడరేషన్ పిలుపు మేరకు జరిగిన ఈ కీలక సమావేశానికి సుమలత, రఘు మాస్టర్ వర్గాలతో పాటు దాదాపు 225 మందికి పైగా డ్యాన్సర్లు హాజరయ్యారు. యూనియన్‌లో నెలకొన్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో సభ్యులు బలపరీక్ష తరహాలో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో సుమలత వైపు కేవలం 11 మంది మాత్రమే నిలవగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ వైపు ఏకంగా 214 మందికి పైగా భారీ మద్దతు ప్రకటించారు.
డ్యాన్సర్లందరి మెజారిటీ మద్దతు రఘు మాస్టర్ వైపు ఉండటంతో, ఫెడరేషన్ పెద్దలు వెంటనే స్పందించి సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానించారు. అసోసియేషన్‌లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలనే ఈ సంక్షోభం తలెత్తిందని సాధారణ సభ్యులు ఆరోపించారు. పరిశ్రమలోని అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్లు కూడా రఘు మాస్టర్ నాయకత్వానికి పూర్తి మద్దతు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు నూతన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికల తేదీని కూడా ఫెడరేషన్ ప్రకటించింది. వచ్చే నెల అక్టోబర్ 11వ తేదీన డ్యాన్సర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

