శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 11:58:28

రేపు ‘దిశా ఎన్ కౌంట‌ర్’ ట్రైల‌ర్..ట్విట‌ర్ లో వ‌ర్మ‌

రేపు ‘దిశా ఎన్ కౌంట‌ర్’ ట్రైల‌ర్..ట్విట‌ర్ లో వ‌ర్మ‌

తెలంగాణ‌లో 2019 నవంబ‌ర్ లో జ‌రిగిన దిశా హ‌త్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సృష్టించిన విష‌యం తెలిసందే. ఈ ఘ‌ట‌న ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తోన్న చిత్రం దిశా ఎన్ కౌంట‌ర్. ఇంటెన్స్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తోన్న ఈ మూవీ ట్రైల‌ర్ రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని వ‌ర్మ ట్విటర్ ద్వారా తెలియ‌జేశారు. సెప్టెంబ‌ర్ 26 ఉద‌యం 9.08 నిమిషాల‌కు దిశా ఎన్ కౌంట‌ర్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ట్వీట్ లో పేర్కొన్నారు.రాంగోపాల్‌ వ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆనంద్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ యువ‌తి హైవే ప‌క్క‌నే బ్యాగు వేసుకుని నిల్చున్న పోస్ట‌ర్ ను ట్విట‌ర్ లో పోస్ట్ చేసిన వర్మ‌.. లీడ్ రోల్ పోషిస్తున్న న‌టి ఎవ‌ర‌నేది మాత్రం సస్పెన్స్ లో పెట్టాడు.

దిశా హ‌త్యాచార ఘ‌ట‌న నేప‌థ్యం, నిందితుల‌ను పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారు..? ఎలా ఎన్ కౌంట‌ర్ చేశారు..? ఈ ఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా ఎలాంటి ఆందోళ‌నలు జ‌రిగాయ‌నే విష‌యాల‌ను ఈ మూవీలో చూపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 


హైదరాబాద్‌లో మరో ప్రణయ్‌ హత్య.. కులాంతర ప్రేమ వివాహమే కారణం

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.