రైస్‌మిల్లు వ్యాపారి ఆత్మహత్య
అప్పుల బాధతో ఓ రైస్‌మిల్లు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం జరిగింది.
- వ్యాపార భాగస్వామికి రూ.8 కోట్లు అప్పు
- అతడు మరణించడం.. ఆ డబ్బు రాక మనస్తాపంతో బలవన్మరణం
దుబ్బాక, మే 3: అప్పుల బాధతో ఓ రైస్‌మిల్లు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చపేటకు చెందిన కాచం నాగార్జున (55) స్థానికంగానే సుమారు 20 ఏండ్ల కిందట మహేశ్వర రైసుమిల్లు ఏర్పాటు చేశాడు. అదే గ్రామానికి చెందిన తడకమడ్ల విశ్వం, అతడి బంధువులతోపాటు కాచం నాగార్జున భాగస్వామిగా ఉంటూ నడిపిస్తున్నారు.
విశ్వంకు నాగార్జున సుమారు రూ.8 కోట్లు అప్పుగా ఇచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విశ్వం ఆర్థికంగా నష్టపోయాడు. ఆ తరువాత అనారోగ్యానికి గురైన విశ్వం 10 నెలల కిందట మరణించాడు. విశ్వంకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నాగార్జునను అతడి బంధువులు, స్నేహితులు ఒత్తిడి చేశారు. తనకు రూ.8 కోట్లు ఇవ్వాలని విశ్వం కుటుంబ సభ్యులను నాగార్జున పలుమార్లు కోరగా వారు పట్టించుకోలేదు. దీంతో మానసికంగా కలత చెందిన నాగార్జున శుక్రవారం మధ్యాహ్నం రైస్‌మిల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన తడకమడ్ల గణేశ్, విశ్వం కుమారుడు నీరజ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగార్జున కుమారుడు మణికంఠ దుబ్బాక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

