Anil Ravipudi | సాధారణంగా దర్శకులు తమ సినిమాల్లో అక్కడక్కడా అతిథి పాత్రల్లో మెరుస్తూ ప్రేక్షకులను, అభిమానులను మెస్మరైజ్ చేస్తారు. అయితే కొంత మంది దర్శకులు మాత్రం నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తుంటారు. హీరో కమ్ దర్శకులు మన టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లో కూడా వున్నారు. దర్శకత్వంతో నటనను కొనసాగించిన వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కళాతపస్వి కె.విశ్వనాథ్. ఆయన దర్శకుడిగా ఎంతటి లబ్ధ ప్రతిష్టుడో అందరికి తెలిసిందే. నటనలో కూడా ఆయన అంతే పేరును తెచ్చుకున్నాడు.
అయితే కొంత మంది సీనియర్ దర్శకులు దర్శకత్వం మానేసి కేవలం నటననే కొనసాగిస్తూ వుంటారు. కాశీ విశ్వనాథ్, దేవిప్రసాద్ తదితరులు ఇలాంటి కోవలోకి వస్తారు. అయితే తాజాగా ఈ జాబితాలో చేరబోతున్నారు వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). వరుస హిట్లతో క్రేజీ దర్శకుడిగా పేరు సంపాందించిన ఈ యువ దర్శకుడు మల్టీ టాలెంటెడ్. దర్శకత్వంతో పాటు అనిల్ రావిపూడి డ్యాన్స్‌లు చేయడం, నటించడంలో కూడా ప్రావీణ్యుడు. తన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అలా తళుక్కున మెరుస్తుంటాడు.
అయితే త్వరలో అనిల్ రావిపూడి హీరోగా ఓ చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. 20 కోట్ల బడ్జెట్‌తో ఆయన కథానాయకుడిగా.. ఓ నిర్మాతగా చిత్రాన్ని నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాడట. ఇందుకోసం అనిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. అయితే గతంలో కూడా వీవీ వినాయక్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు. శీనయ్య పేరుతో ప్రారంభోత్సం కూడా జరుపుకున్న ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.
ఇక అనిల్ రావిపూడి చిత్రం కూడా ఇలాగే ప్రకటనకే పరిమితమవుతుందా? లేక సెట్స్ మీదకు వెళుతుందా చూడాలి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అగ్ర కథానాయకుడు వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Chiranjeevi | కల్కి 2898 ఏడీ మేకర్స్ తీరుతో చిరంజీవి అభిమానులు అప్సెట్.. కారణమిదేనట..!
They Call Him OG | పవన్ కల్యాణ్ బ్యాక్ టు సెట్స్.. ఓజీ షూట్ డేట్ ఫిక్సయినట్టే..?
Matka | వరుణ్ తేజ్ మట్కా కింగ్ వాసు లుక్ అదిరింది.. !