Dil Raju | ‘దిల్’ రాజు (Dil Raju) ఒకప్పుడు విజయాలకు, నవ్యమైన కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేవాడు. పంపిణీదారుడిగా సక్సెస్ అయిన తరువాత ‘దిల్’ సినిమాతో నిర్మాతగా రంగప్రవేశం చేసిన ఈ యువ నిర్మాత అనతి కాలంలోనే సక్సెస్ఫుల్ అండ్ టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘ఆర్య’ లాంటి ట్రెండ్ సెట్టర్ ప్రేమకథను, సుకుమార్ లాంటి ఓ క్రియేటివ్ పాన్ ఇండియా దర్శకుడిని సినీ పరిశ్రమకు అందించారు. ‘భద్ర’ చిత్రంతో బోయపాటి శ్రీను లాంటి ఓ మాస్ కమర్షియల్ దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేశాను.
కథ వినగానే టీవీ సీరియల్ కథ అని అందరూ వాదించినా తను మాత్రం ఆ సినిమాలో కొడుకు, తండ్రిల భావోద్వేగాలను, హృదయాలను హత్తుకునే ఫ్యామిలీ డ్రామాను విజువలైజ్ చేసుకుని ‘బొమ్మరిల్లు’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అందించాడు. ‘కొత్త బంగారులోకం’ లాంటి టీనేజ్ యూత్ లవ్‌స్టోరీని జడ్జ్ చేసి, ఆ సినిమానతో కూడా తన అభిరుచిని చాటుకున్నాడు. ఈ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్.
క్లాసిక్ కల్ట్ సినిమా బలగం..
ఇక ఇటీవల తెలంగాణ నేపథ్యంలో ‘బలగం’లాంటి క్లాసిక్ కల్ట్ సినిమాని అందించి అందరి మనసులను గెలుచుకున్నాడు. తెలంగాణలోని ప్రతి పల్లోటూరులో ‘బలగం’ సినిమాను తెరలు కట్టుకుని చూశారు. అప్పటి వరకు కమెడియన్‌గా ఉన్నవేణుని ‘బలగం’ చిత్రంతో ఓ గొప్ప దర్శకుడిని చేశాడు. దిల్ రాజు తన యాభై సినిమాల ప్రయాణంలో కొన్ని తప్పటడుగులు కూడా వేశాడు.
కొన్ని కథలను జడ్జ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఆయన బ్యానర్లో ఎంతటి గొప్ప సినిమాలు వచ్చాయో… అంతటి డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇలాంటి విభిన్నమైన సినిమాలతో పాటు ఫిదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, శతమానం భవతి లాంటి కుటుంబ కథా చిత్రాలను కూడా తనదైన మార్క్‌తో అందించాడు.
నిజం చెప్పాలంటే ఇలాంటి గొప్ప చిత్రాలు, కథా బలం ఉన్న చిత్రాలు నిర్మించిన అతి తక్కువ మంది దర్శకుల జాబితాలో ‘దిల్’ రాజు ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల దిల్ రాజు తన ట్రాక్‌ను మార్చి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను, కాంబినేషన్ మానియాను నమ్ముకుని, తన వర్జినల్ స్ట్రెంగ్త్‌ను మర్చిపోయాడు. ఈ క్రమంలోనే దిల్‌రాజు పరాజయాలను చవిచూస్తున్నాడు.
సంక్రాంతికి వస్తున్నాం పాఠం నేర్పింది..
ఇటీవల ఆయన సంస్థలో నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలను సంక్రాంతి సీజన్లో విడుదల చేశాడు. ఇందులో గేమ్ ఛేంజర్ ఫలితం ‘దిల్’రాజును నిరాశపరచింది. సంక్రాంతికి వస్తున్నాం కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. అయితే ఇటీవల దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం ప్రెస్మీట్లో ట్రాక్ తప్పుతున్న నన్ను సంక్రాంతికి వస్తున్నాం సినిమా మళ్లీ సరైన మార్గంలోకి నడిపించింది,
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాకు పాఠం నేర్పింది అనే వ్యాఖ్యలు దిల్ రాజు చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం కంటెంట్ పరంగా మీ స్థాయి సినిమా కాదు.
మీ బ్యానర్లో వచ్చిన ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, బలగం వంటి కమర్షియల్ క్లాసిక్ ఉన్నాయనే సంగతి మర్చిపోతున్నారు. అయినా మీ నుండి మేము కోరుకునేది ఈ తరహా నవ్యమైన కథలే సార్.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు.
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?