Tollywood | దిల్ రాజు ( Dil Raju )కు టాలీవుడ్లో ఎలాంటి ఇమేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన బ్యానర్ నుంచి సినిమా వచ్చింది అంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకం సంపాదించుకున్నాడు. చిన్న సినిమాలతో పాటు స్టార్ హీరోలతో కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంటాడు దిల్ రాజు. 20 ఏళ్ల నిర్మాణంలో ఏ రోజు బడ్జెట్ లిమిట్ క్రాస్ చేయలేదు ఈయన. ఎంత పెద్ద హీరోతో సినిమా చేసినా కూడా తన ప్లానింగ్ తనకు ఉంటుంది. సినిమాకు బడ్జెట్ ఎక్కువ పెట్టినా కూడా నష్టాల పాలు కాకుండా ఎలా బయటపడాలి అనేది దిల్ రాజుకు బాగా తెలుసు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈయన తన ట్రాక్ మారుస్తున్నాడు. వరుసగా భారీ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అవుతున్నాడు. ఒక్కో సినిమాకు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు దిల్ రాజు. ఇది చాలా మందికి అర్థంకాని ఫజిల్. కానీ ఇక్కడ కూడా రాజు గారి లెక్కలు రాజు గారికి ఉంటాయి అంటున్నారు ఆయన సన్నిహితులు.
రామ్ చరణ్ ( ram charan ) హీరోగా శంకర్ ( shankar ) దర్శకత్వంలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా (RC15)కు ముహూర్తం పెట్టాడు దిల్ రాజు. అలాగే వంశీ పైడిపల్లి, దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా మరో బిగ్గెస్ట్ కాంబినేషన్ సెట్ చేశాడు. ఇందులో విజయ్ కి దాదాపు 80 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఐకాన్ సినిమా కూడా అన్ని భాషల్లో విడుదల కానుంది. దీని బడ్జెట్ కూడా 100 కోట్ల పై మాటే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పై అధికారిక ప్రకటన రానుంది.
ఇక హిందీలోనూ దిల్ రాజు తన మార్క్ చూపిస్తున్నాడు. అల్లు అరవింద్ తో కలిసి జెర్సీ సినిమా రీమేక్ చేస్తున్నాడు. వీలైనంత వరకు చిన్న సినిమాలు చేసుకుంటూ.. అప్పుడప్పుడు పెద్ద సినిమాలు చేసే దిల్ రాజు.. ఇప్పుడు ఉన్నట్టుండి గేర్ మార్చాడు. రాబోయే మూడు నాలుగు సినిమాలకు దాదాపు 1000 కోట్ల బడ్జెట్ సెట్ చేసుకుంటున్నాడు. ఈ దెబ్బతో దిల్ రాజు పేరు ఇండియాలో మార్మోగిపోవడం ఖాయం. అంతేకాదు ప్రభాస్ 25వ సినిమాను కూడా తన బ్యానర్ లోనే నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నాడు దిల్ రాజు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఏ భాష మాట్లాడి అవమానపడ్డదో, ఆ భాషకే బ్రాండ్ అంబాసిడరైంది..
ఫోన్ సిగ్నల్స్ కూడా లేని ప్రాంతంలో రష్మిక.. దర్శకుడికి సారీ చెప్పిన కన్నడ బ్యూటీ
Pawan: ‘భవదీయుడు భగత్ సింగ్’గా పవన్ కళ్యాణ్.. ఫస్ట్ లుక్ విడుదల
Samantha: సమంత ఇంతలా రెచ్చిపోయిందేంటి…!