Ponnam Prabhakar | బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోండి.. డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి పొన్నం..!
Ponnam Prabhakar : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.
Ponnam Prabhakar : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటును భారత్, పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి తన లేఖలో పేర్కొ్న్నారు.
‘తెలంగాణ ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ.. ఒక ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగింది. తెలంగాణ ఏర్పాటను భారతదేశపు బాధాకరమైన, హింసాత్మక విభజనతో పోల్చడం ఆ ప్రక్రియ పవిత్రతను తగ్గించడమే కాకుండా.., తెలంగాణ ప్రజల మనోభావాలను విస్మరించినట్లు అవుతుంది.
VIDEO | Telangana Minister Ponnam Prabhakar (@Ponnam_INC) says, “BJP MP Tejaswi Surya should resign for comparing Telangana’s formation with India-Pakistan partition.” #Telangana pic.twitter.com/LVvO0Dybun
— Press Trust of India (@PTI_News) April 16, 2026
ఇటువంటి ప్రకటనలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ప్రాంతీయ కలహాలను పెంచడానికి, చారిత్రక, రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించడానికి అవకాశం ఉంది. అలానే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ప్రజా శాంతి, సామరస్యాలను కాపాడడానికి. ఈ విషయాన్ని పరిశీలించి, చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం బీజేపీ ఎంపీపై తగిన చర్యలు తీసుకోవాలి’అని డీజీపీనీ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

