Pawan: ‘భవదీయుడు భగత్ సింగ్’గా పవన్ కళ్యాణ్.. ఫస్ట్ లుక్ విడుదల

వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన పవన్ త్వరలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొననున్నాడు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ కూడా కొంత పూర్తైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఈ కాంబోలో సినిమా రావలని అభిమానులు ఎంతగానో ఆశించారు. అది ఇప్పుడు నెరవేరబోతుంది.త్వరలో పవన్- హరీష్ శంకర్ మూవీ పట్టాలెక్కనుండగా తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్.
పవన్ 28వ సినిమాకు ”భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. భగత్ సింగ్ అంటే రెబల్, భవదీయుడు అనే పదంలో ఓ రకమైన వినమ్రత, సౌమ్యం కనిపిస్తోంది. ఈ రెండూ కలిపి టైటిల్ గా మార్చేశారు మేకర్స్. టైటిల్ అభిమానులకి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఇక ఫస్ట్ లుక్‌లో పవన్ బైక్‌పై కూర్చొని టీ తాగుతూ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

