అక్కినేని కోడలు సమంత ఫ్యాషనిస్ట్కి ఐకాన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనతో పాటు తన అందచందాలతో అలరిస్తున్న సమంత అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సమంత .. యోగా జిమ్ సెషన్స్ మొదలుకొని బీచ్ వేర్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదీ ఫోటోషూట్ల రూపంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తుంటుంది.
కొద్ది రోజులుగా గోవా టూర్లో ఉన్న సమంత అక్కడి విశేషాలను తెలియజేస్తూ వస్తుంది. తాజాగా బ్లాక్ బ్రాలెట్లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది సమంత. ఒకవైపు అందాలు మరోవైపు ఆబ్స్ని ప్రదర్శిస్తూ ఫొటో షూట్ చేయగా, ఈ పిక్స్ సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి. అక్కినేని కోడలు అప్పుడప్పుడు ఇల సర్ప్రైజ్లు ఇస్తూ అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంటుంది.
ఇవి ప్రఖ్యాత లూయిస్ విట్టన్ షూట్ కి సంబంధించిన ఫోటోలు కాగా, ఆమె వాటికి సంబంధించిన బ్రాండ్ దుస్తులు బూట్లు ఇతర ఉపకరణాలతో ప్రత్యక్షమైంది. ఆ బ్లాక్ కలర్ బ్యాగ్ కూడా అదే బ్రాండ్. లూయీస్ వీట్టన్ ప్రమోషన్స్ కోసం సామ్ భారీ కాంట్రాక్ట్ ని కుదుర్చుకుందని వీటిని బట్టి అర్దమవుతుంది. సమంత సినిమాల కన్నా వాణిజ్య ప్రకటనల ద్వారా ఎక్కువ సంపాదిస్తుంది. సినిమాల విషయానికి వస్తే శాకుంతలం షూటింగ్ ని ముగించిన సామ్ కొద్ది రోజులుగా తమిళ చిత్రంతో బిజీగా ఉంది.