‘ఆర్య’ సినిమాతో దర్శకుడు సుకుమార్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు నిర్మాత దిల్ రాజు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేమకథా చిత్రాల్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఆర్య’ సినిమా తరువాత దిల్ రాజు- సుకుమార్ కాంబోలో మరో సినిమా రాలేదు. అయితే ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప-2 ది రూల్ ఈ చిత్రం చిత్రీకరణలో బిజీగా వున్నాడు. ఒకవైపు షూటింగ్‌తో పాటు మరోవైపు నిర్మాణానంతర పనులతో తలమునకలై వున్నాడు ఈ దర్శకుడు.
అయితే తాను సుకుమార్ రైటింగ్స్‌తో అసోసియేషన్‌తో నిర్మిస్తున్న ‘సెల్ఫీష్’ చిత్రం చిత్రీకరణను ఆపేశానని తెలియజేశారు దిల్‌రాజు. వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వంలో సెల్పీష్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటి వరకు యాభై శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం బ్యాలెన్స్ వర్క్ పుష్ప-2 విడుదల తరువాత మళ్లీ మొదలుపెడతానని తెలియజేశారు దిల్ రాజు.
పుష్ప-2 రిలీజ్ తరువాత సుకుమార్ ఈ చిత్రం కథా చర్చల్లో పాల్గొంటాడని, ఆయన సలహాలు, సూచనలతో మళ్లీ ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు ప్రస్తుతం తమ సంస్థలో త్వరలో నితిన్ హీరోగా బలగం వేణు దర్శకత్వంలో యెల్లమ్మ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నామని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలుపెడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. సోమవారం జరిగిన దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లాంచ్‌లో ఆయన ఈ వివరాలు తెలిపారు.
Read Also
Kamal Hassan | అద్దంలో నా ముఖం చూసుకున్నప్పుడల్లా నిజం తెలుస్తుంది: కమల్‌హాసన్
Sandeep Raj | కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్
Aamir Khan | మరో పదేళ్లు పనిచేయగలను.. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్