Sandeep Raj | కలర్‌ఫొటో సినిమాతో డైరెక్టర్‌గా మంచి ఫేం సంపాదించాడు సందీప్ రాజ్ (Sandeep Raj). డైరెక్టర్‌గా, రైటర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న సందీప్ రాజ్ త్వరలోనే పెండ్లి పీటలెక్కబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వార్త బయటకు వచ్చింది. సోమవారం సందీప్ రాజ్- నటి, క్లాసికల్ డ్యాన్సర్ చాందిని రావు నిశ్చితార్థం పూర్తయింది.
వైజాగ్‌లో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో సందీప్ రాజ్-చాందిని రావు నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా యంగ్ కపుల్‌కు ఇండస్ట్రీ ప్రముఖులు, మూవీ లవర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఇద్దరు డిసెంబర్ 7న తిరుపతిలో జరిగే వెడ్డింగ్ ఈవెంట్‌తో ఒక్కటి కాబోతున్నారు.
షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన సందీప్ రాజ్ డెబ్యూ సినిమా కలర్‌ఫొటో ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చాందినీ రావు కలర్‌ఫొటో, రణస్థలి, హెడ్ అండ్ టేల్స్‌తోపాటు పలు వెబ్ సిరీస్‌లలో నటించింది. చాందిని రావు ప్రొడక్షన్ హౌస్‌ను కూడా మెయింటైన్ చేస్తుంది.
సందీప్ రాజ్ ప్రస్తుతం రోషన్ కనకాలతో Mougli సినిమా ప్రకటించగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ షురూ కానున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది.
సందీప్ రాజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు..
Congratulations to Director #SandeepRaaj and actress #ChandiniRao on their engagement! 💝🥳
Wishing the beautiful couple a lifetime of happiness, love, and togetherness! ❤️🤗#SandeepRaj #Tollywood #vega #entertainment #vegaentertainment pic.twitter.com/bPHYEx9KHt
— Vega Entertainment (@vegaent) November 12, 2024
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?