తమిళ కథానాయకుడు కమల్ హాసన్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తన పేరుకు ముందు అభిమానంతో అందరూ పిలుచుకుంటున్న ఉలగనాయన్తో కానీ ఇక ఎలాంటి స్టార్ ట్యాగ్స్‌తో పిలవొద్దని, కమల్ లేదా కమల్ హాసన్ అనే పేరుతో పిలవమని అందరికి విజ్క్షప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ” నా నటనను మెచ్చి ఉలగనాయగన్’ వంటి ఆత్మీయ ట్యాగ్లు అందించినందుకు ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతుడిని. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులను అందించాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ఆ ప్రకటనలో తెలియజేశారు కమల్‌హాసన్.
అయితే నటుడిగా అత్యధిక పురస్కారలు అందుకున్న వారిలో ఈయనే అగ్ర గణ్యుడు. నటుడిగా కమల్ అందుకున్నానని పురస్కారాలు ఎవరూ అందుకోలేదు. అయితే తనని తాను ఎప్పుడూ నటుడిగా నిత్యవిద్యార్థినే అనుకునే ఈ నటుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నటన గురించి మరికొన్ని కామెంట్స్ చేశాడు. ” అద్దంలో నా ముఖం చూసుకున్నప్పుడల్లా నటనలో పరిపూర్ణత వుండదనేది తెలిసిపోతుంది. నేను నటించిన కొన్ని సినిమాలు తరువాత చూసినప్పుడు మరింత బాగా నటిస్తే బాగుండేది అనిపిస్తుంది.
నా మైనస్‌లు నాకు తెలిసిపోతాయి. అయితే అప్పటికి ఆ సినిమాకు అవార్డులు వచ్చి ఉంటాయి. అందరూ ప్రశంసించి ఉంటారు. అయినా ఆ పాత్ర కోసం నేను ఇంకా ఏం చేయగలనో నాకు తెలుసు. ఆ సినిమానే రీమేక్ చేసి ఆ లోపాలను సరిదిద్దుకోవాలనిపిస్తుంది. కానీ అది అంత సులువు కాదు. అందుకే నటనలో కంప్లీట్‌నెస్ అనేది వుండదు.కాకపోతే ఆ దిశగా సాధించే వరకు జర్నీ చేయాల్సిందే” అంటూ చెప్పుకొచ్చారు.
Read Also
NTR | అమ్మ అందుకే బయటకి రావడానికి ఇష్టపడదు: ఎన్టీఆర్
Aamir Khan | మరో పదేళ్లు పనిచేయగలను.. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్