టాలీవుడ్ (Tollywood) స్టార్లు గోపీచంద్ (Gopichand), తమన్నా (Tamannah) కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ సీటీమార్ (Seetimaarr). దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi) కీ రోల్ పోషించింది. ఈ ముంబై భామ యాక్టింగ్లోకాదు అకాడమిక్ స్టడీస్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ ఇటీవలే తన బీఏ డిగ్రీని పూర్తి చేసింది. అయితే మూడేళ్లలో పూర్తి చేయాల్సిన డిగ్రీకి దిగంగనా ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ వల్ల 5 ఏళ్ల సమయం పట్టింది.
ఇటీవలే తనకిష్టమైన ఎంబీఏ ప్రోగ్రామ్ (MBA program)లో చేరింది దిగంగనా. చిన్ననాటి నుంచి తాను మంచి విద్యార్థిని అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దిగంగనా. ఏడేళ్ల వయస్సు నుంచి ఓ వైపు స్టడీస్‌ను, మరోవైపు వృత్తిపరమైన కమిట్మెంట్స్ ను బ్యాలెన్సింగ్ చేస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నానని చెప్పింది. దిగంగనా సూర్యవంశి ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ది బాటిల్ ఆఫ్ భీమా కోరెగావ్, డార్క్ పాత్ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు తెలుగులో సందీప్ కిషన్‌తో సినిమా చేస్తోంది.
2019లో కార్తికేయ హీరోగా వచ్చిన హిప్పీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దిగంగనా. ఆ తర్వాత వలయం చిత్రంలో నటించింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!