Rashmika Mandanna | టాలీవుడ్ లవ్‌బర్డ్స్‌గా పేరుగాంచిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇంతలోనే వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ పెళ్లి వార్తల వేళ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రష్మిక ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘మీరు డేట్ చేస్తే ఎవరితో చేస్తారు..? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు..?’ అని ప్రశ్నించారు. దీనికి రష్మిక స్పందిస్తూ.. ‘యానిమేటర్ నరుటోతో డేట్ చేస్తాను. పెళ్లి విజయ్‌ని చేసుకుంటా’ అంటూ సమాధానం ఇచ్చింది. రష్మిక సమాధానంతో అక్కడున్న వారంతా గట్టిగా అరుస్తూ.. కంగ్రాట్స్ చెప్పారు. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు వీరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు టాక్. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read..
Actor Vishal | కోయంబత్తూర్ ఘటనపై నటుడు విశాల్ ఆవేదన.. నిందితులకు మరణశిక్ష విధించండి
Proddatur Dussehra | ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలపై డాక్యుమెంటరీ.. ఓటీటీలో స్ట్రీమింగ్
Anumana Pakshi | కశ్మీర్ షూటింగ్ స్పాట్లో ‘అనుమాన పక్షి’ టీం