Proddatur Dussehra | ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలపై డాక్యుమెంటరీ.. ఓటీటీలో స్ట్రీమింగ్
Proddatur Dussehra | రాయలసీమలోని ప్రొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా, వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Rayala Seema | రాయలసీమలోని ప్రొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాలు ఎంత ఘనంగా వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వేడుకలను చూడటానికి చూట్టుప్రక్కల ఉన్న గ్రామాలే ప్రజల కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి తిలకిస్తారు. అయితే ఈ అద్భుతమైన దసరా వేడుకల వైభవాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మురళీ కృష్ణ తుమ్మ అనే దర్శకుడు దీనిపై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించారు.
‘బాల్కనీ ఒరిజినల్స్’ బ్యానర్ మీద, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. ఈ డాక్యుమెంటరీని కొత్త టీం అద్భుతంగా, కన్నుల పండువగా తెరకెక్కించిందని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్టోబర్ 31న విడుదలై మంచి ఆదరణ పొందిన ఈ డాక్యుమెంటరీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ (ETV Win)లో ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 40 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ.. ప్రొద్దుటూరులో జరిగే దసరా ఉత్సవాలు, ఆచారాలు, సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఈ డాక్యుమెంటరీకి స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ అందించగా, కిలారి సుబ్బారావు పీఆర్ఓగా వ్యవహరించారు. ‘బాల్కనీ ఒరిజినల్స్’ బ్యానర్ నుంచి మరిన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు రానున్నాయని సమాచారం.
Rayalaseema’s pride and devotion shine bright! 🌸
Proddatur Dussehra premieres Nov 7 🪔📲 Only on @etvwin@etvwin #KrishnaMuraliThumma @PremKvalapala @Yashwanth_Nag #VenkateshChunduru @BalconyOrigina1 @AkiCreativeWork@chvenkatesh78 @APTDCofficial @Tourism_AP #IDEALDOTS… pic.twitter.com/O18qO83Bi5
— ETV Win (@etvwin) November 6, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

