Actor Vishal | కోయంబత్తూర్ ఘటనపై నటుడు విశాల్ ఆవేదన.. నిందితులకు మరణశిక్ష విధించండి
Actor Vishal | కోయంబత్తూర్ విమానాశ్రయం సమీపంలో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
Actor Vishal | కోయంబత్తూర్ విమానాశ్రయం సమీపంలో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో కారులో ఉన్న ఓ విద్యార్థినిని ముగ్గురు యువకులు అపహరించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
అయితే ఈ ఘటనపై స్పందిస్తూ.. రాత్రిపూట ఆ విద్యార్థిని బయటకు ఎందుకెళ్లిందని ఎమ్మెల్యే ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరాత్రి పురుషుడితో బయటకు వెళ్లడాన్ని సామాజిక పతనంగా అభివర్ణించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా హీరో విశాల్ (Vishal) సైతం ఈ వ్యవహారంపై స్పందించాడు. విశాల్ ఎక్స్ వేదికగా రాసుకోస్తూ.. ఆ సమయంలో ఆ ప్రదేశంలో బాధితురాలు ఎందుకు ఉందని నిందించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న ఈ అత్యాచారాలను రాజకీయం చేయండి మానుకోండి. న్యాయవ్యవస్థ ముందు మోకరిల్లి అడుగుతున్నా.. మీ కాళ్లు పట్టుకుంటా.. దయచేసి ఇంత దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులకు మరణశిక్ష వేయండి. గతంలో నిర్భయ ఉదంతాలను చూశాం. ఏడేళ్ల బాలికను అత్యాచారం చేయడంతో పాటు కన్న తల్లిని నిర్దాక్ష్యిణ్యంగా హత్య చేసిన వ్యక్తి సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఇలాంటివి సౌదీ అరేబియా వంటి దేశాల్లో సాధ్యమవుతాయా? ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న చర్యలు నిజంగా మెచ్చుకోదగినవి. ఆయనకు నేను సెల్యూట్ చేస్తున్నా.. అని విశాల్ ట్వీట్ చేశాడు.
Stop blaming the victim for being at that place at that hour. Stop politicising this bloody gory recurring issue, rape in our country.
High time atleast now I beg, bow and fall on your feet dear Judicial system and lawmakers. Kindly bring about captial punishment and death…
— Vishal (@VishalKOfficial) November 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

